ఆదిపురుష్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.. ఈ ఏడాది ప్రభాస్ తన సినిమాలను వేగంగా పూర్తి చేయనున్నారు.. ఆదిపురుష్ సినిమా ముంబైలో జనవరి 19 న ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది… ఇక ప్రభాస్ పండుగ పూర్తి అయిన తర్వాత నేరుగా ముంబై వెళ్లనున్నారు, ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేశారు.
రావణ్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నారు, అయితే ఈ మూవీలో సైఫ్ది కూడా చాలా భాగం షూటింగ్ ఉంది.
సైఫ్ అలీఖాన్ మార్చి వరకు షూటింగ్కు వచ్చేది లేదని తెగేసి చెప్పేశారట. ప్రస్తుతం సైఫ్ భార్య కరీనా కపూర్ ప్రెగ్నెంట్. జనవరిలో ఈ జంట రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. అందుకే ముందుగానే ఆయన ఈ విషయం చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భార్యకి తోడుగా ఆయన ఉండనున్నారట.
అయితే కుదిరితే ఫ్రిబ్రవరి నుంచి ఆయన షూటింగ్ కు జాయిన్ అవుతారు అని తెలుస్తోంది, ఈ సినిమా చాలా వరకూ స్టూడియోలో భారీ గ్రీన్మ్యాట్ సెట్లో చేయనున్నారు, ఇక ముందు ప్రభాస్ కి సంబంధించిన షూట్ పూర్తి చేయనున్నారట.