మన దేశంలో కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ కూడా బెంబెలెత్తిస్తోంది, ఇలాంటి వేళ బర్డ్ ఫ్లూ కూడా వేధిస్తోంది, ఈ వైరస్ సోకిన పక్షులు చనిపోతున్నాయి, దీంతో ఇప్పటికే ఉత్తరాధి రాష్ట్రాలు బెంబెలెత్తుతున్నాయి.. అక్కడ జనం కూడా చికెన్ గుడ్డు తినడం తగ్గించేశారు.. దీంతో కోడి రేటు గుడ్డు రేటు భారీగా తగ్గిపోయాయి.
ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో గుడ్డు మాంసం తినాలా వద్దా అని చర్చించుకుంటున్నారు ప్రజలు. వైద్యులు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు, ఈ వైరస్ సోకిన పక్షులని ముట్టుకున్నా వాటి మాంసం సరిగ్గా ఉడికించకుండా తీసుకున్నా కచ్చితంగా వైరస్ మనిషికి వస్తుంది అంటున్నారు.
బాగా ఉడికించిన గుడ్లు మాంసం తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని, మీరు కనీసం 70 డిగ్రీల వరకు ఉడికిస్తే వైరస్ చనిపోతుందని డబ్ల్యూహెచ్ వో చెప్పింది… సో దీనిపై అనేక అపోహలు వినిపిస్తున్నాయి, బాగా ఉడికించి చికెన్ గుడ్డు తీసుకోండి..
హాఫ్ బాయిల్డ్ సగం ఉడికించిన మాంసాన్ని అస్సలు తీసుకోవద్దు, ఇక కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకుని ఫుడ్ తినాలి.