కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా, ఎలాంటి మానసిక సంఘర్షణ ఆర్దిక ఇబ్బందులు ఉండకూడదు అంటే, మనం దేవుడిని కొలవాలి. భక్తి శ్రద్దలతో ఉండాలి.. ఇంట్లో కొన్ని వస్తువులు కూడా మన పై ప్రభావం చూపిస్తాయి… ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కిస్తాయి అంటున్నారు పండితులు… కొన్ని వస్తువులు ఇంటిలో పెట్టుకోవడం వలన ప్రశాంతత ఉంటుంది.. ఆర్దిక కష్టాలు దూరం అవుతాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..
ఇంటిలో నెగిటీవ్ ఎనర్జీ దూరం చేసి పాజిటీవ్ ఎరర్జీని అందించే వస్తువులు ఏమిటి అనేది చూద్దాం…
1.. ఓంకారం చిహ్నం, రాగి వెండి ఇలా ఎందులో ఉన్నా ఇది ఇంటికి మంచిది
2.. పూర్ణ కుంభం ఇంట్లో ఉంటే చాలా మంచిది రాగి, ఇత్తడి, వెండి, బంగారం దేనితో అయినా చేసింది ఉంచుకోవచ్చు
ఇంట్లోని పూజ గదిలో దీన్ని ఉంచాలి.
3..జపనీస్ ఫెంగ్ షుయ్ తాబేలు దీనిని మనం ఓ ప్లేటులో నీరు పోసి ఉంచితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు
4..మూడు కాయిన్లను ఎరుపురంగు రిబ్బన్తో కట్టి ఉంచండి.. ఇంటి గుమ్మం ముందు ఉంచాలి
5. చేపల్ని ఇంటిలో పెంచడం ఇది మంచిదే గోల్డెన్ ఫిష్ మీ జీవితాన్ని మరింత ఆనందంగా చేస్తుంది
6.. చేప ఆకారంలోని చిహ్నాలనైనా ఇంటి ముందు పెట్టుకోవచ్చు
7..ఎక్వేరియంలో రంగుల చేపల్ని పెంచడం మంచిదే కాని వాటికి ఆహారం పెట్టాలి
8.. పెరట్లో వెదురు మొక్కల్నిపెంచితే మంచిది
9..కలబంద మొక్క ఇంటికి చాలా మంచిది ఆర్ధిక పురోగతి ఉంటుంది.
10. లాఫింగ్ బుద్ద ఇది ఇంటికి మంచిది నెగిటీవ్ ఎనర్జీ దూరం చేస్తుంది.