తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తూ ఉంటారు. చాలా మంది కాలినడకన తిరుమల చేరుకుంటారు…అలిపిరి నుంచి కొండ మీదికి కాలి నడకన వెళ్లాలంటే మొత్తం 3550 మెట్లు ఎక్కాలి.
దాదాపు మొత్తం 9 కిలోమీటర్లు ఉంటుంది.. మరి మన సెలబ్రిటీలు ఎవరు ఎవరు ఎంత సమయంలో ఈ మెట్లు ఎక్కారు అనేది తెలుసా.
సో ఓసారి ఆ లిస్ట్ చూద్దాం
టాలీవుడ్ హీరో నితిన్ 2 గంటల 20 నిమిషాల్లోనే అలిపిరి నుంచి కొండమీదకు చేరుకున్నారు
సీఎం జగన్ 3 గంటల 10 నిమిషాలలో కాలిబాటన వెళ్లారు
రాహుల్ గాంధీ అందరికంటే వేగంగా ఎక్కారు 1 గంటా 48 నిమషాల్లో ఎక్కారు
2 గంటల 35 నిమిషాల వ్యవధిలో చంద్రబాబు చేరుకున్నారు
మెగాస్టార్ చిరంజీవి 6 గంటల 40 నిమిషాల సమయంలో చేరుకున్నారు
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 గంటల 20 నిమిషాల్లో చేరుకున్నారు
ఇలా చాలా మంది ప్రముఖులు ఇప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఇలా కాలినడకన వెళతారు, అయితే అభిమానులు కూడా వారిని ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటారు.. దీంతో వారికి కాస్త సమయం పడుతుంది అనేది తెలిసిందే..