ఎంత దారుణం ఎంత దుర్మార్గం అంటే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని కూడా చంపేస్తున్నారు కొందరు మహిళలు… తాజాగా ఇదే జరిగింది.. మయూరు బాబు అనే వ్యక్తి పెయింటర్ అతని భార్య ఇంటిలోనే ఉంటుంది.. అయితే ఇక్కడ నివశిస్తున్న ఓ ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆమె.. చివరకు భార్య ప్రవర్తనతో చాలా సార్లు చెప్పి చూశాడు అయినా ఆమె మారలేదు..
దీంతో ఓ రోజు అతను నిద్ర పోతున్న సమయంలో ప్రియుడికి కబురు పంపింది.. చివరకు ప్రియుడు ఆమె కలిసి భర్తని చంపేశారు… ఎవరికి అనుమానం రాకుండా కిరోసిన్ పోసి ఊరి అవతల పడేశారు శవాన్ని.. అయితే తర్వాత భర్త కనిపించడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.. పోలీసులు అనుమానిత శవం చూపిస్తే అది తన భర్తది కాదు అని చెప్పింది.
కాని పోలీసులకి అనుమానం వచ్చి చనిపోయిన ఆ వ్యక్తి అక్కని పిలిచారు… ఆమె తన తమ్ముడి శవం అని గుర్తు పట్టింది.. అతని స్నేహితులు గుర్తు పట్టారు.. చివరకు భార్యని తమ స్టైల్లో విచారిస్తే ఆమె ప్రియుడు కలిపి చంపాము అనే విషయం తెలిపింది, ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోంది.