వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి అయింది ఇక నేటి నుంచి క్రిష్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు, ఇక తాజాగా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
ఇక మరో సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నారు, ఇక తర్వాత హరీష్ తో సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్…అయితే పవన్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ తో పవన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి…ఈ చిత్రానికి కిశోర్ కుమార్ డాలీ దర్శకత్వం వహిస్తారని టాలీవుడ్ టాక్, ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఇక గతంలో పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రానికి డాలీ దర్శకత్వం వహించారు..