ఒక్కోసారి మనం అనుకున్న వస్తువులు లేదా మనుషులు లేఖలు చేరాల్సిన సమయానికి చేరవు, దీంతో చాలా మంది
ఫీల్ అవుతూ ఉంటారు… ఇక తాజాగా ఓ వ్యక్తి స్నేహితుడికి రాసిన లేఖ ఎంత లేట్ గా చేరింది అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది..బ్రిటన్లో నివసిస్తున్న క్రిస్ అనే పెద్దాయన ఇటీవల ఓ లేఖను అందుకున్నాడు. ఇది తన మిత్రుడు రాసిన లేఖ
అయితే ఇది ఏదో వారం తర్వాత వచ్చిన లేఖ కాదు…. ఎప్పుడో 1955లో రాసినది, ఆ రాసిన వ్యక్తి కూడా చనిపోయాడు, ఈ లేఖ అందుకుని కన్నీరు పెట్టుకున్నాడు క్రిస్.. అమెరికాలో కెండాల్ క్రిస్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ఇక క్రిస్ అక్కడ నుంచి బ్రిటన్ వెళ్లిపోయాడు… తనకు పది సంవత్సరాల వయసులోనే వచ్చేశాడు. ఇలా కొద్ది రోజులు ఉత్తరాసు రాసుకున్నారు మిత్రులు.
కెండాల్ రాసిన పోస్ట్కార్డ్ క్రిస్ కు అందలేదు, చివరకు ఓ పాత లేఖలు పుస్తకాల దుకాణంలో ఈ లేఖ వచ్చింది, అక్కడ పాత కార్డులు సేకరించే వ్యక్తి ఆ పాతపోస్ట్ కార్డ్ సేకరించి అది ఎవరికి చెందాలో వారికి చెందేలా చేశాడు.. అతని అడ్రస్ తెలుసుకుని అందించాడు, అయతే తన స్నేహితుడి చివరి లేఖ చూసి కన్నీరు పెట్టుకున్నాడు క్రిస్.