బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న కారణంగా చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం తగ్గించేశారు జనం.. ఇక అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయాయి.. ఇది సంక్రాంతి సమయం …దీంతో చాలా మంది ఈ సమయంలో చికెన్ సేల్ ఎక్కువ ఉంటుంది అని భావించారు… కాని సీన్ మారిపోయింది ఏపీ తెలంగాణలో కూడా అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.
ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చికెన్, గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడినట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక చికెన్ వంటలు అమ్మద్దని తెలిపారు.
ఇక ఇప్పటికే వైద్యులు తెలిపారు.. బాగా ఉడికించిన గుడ్డు చికెన్ తినాలి అని… కొందరు దీనిని ఫాలో అవుతున్నారు… మరికొందరు మాత్రం అసలు చికెన్ జోలికి వెళ్లడం లేదు…. H5N8 వైరస్ పక్షుల్లో వేగంగా విజృంభిస్తోంది, ఇక మనుషుల్లో పెద్దగా దీని ప్రభావం ఉండదు అని తెలియచేస్తున్నారు.