చికెన్ అంటే చాలా మందికి ఇష్టం.. రోజూ కొన్ని లక్షల కోళ్లు మాంసం దుకాణాలకు వెళతాయి, ఇక కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది, ఇక మాంసం షాపుల్లో నిత్యం జనం కనపిస్తూనే ఉంటారు కాని ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ రోజురోజుకూ దేశంలో విస్తరిస్తున్న నేపధ్యంలో కోట్లాది రూపాయల విలువ చేసే మాంస పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది.
ఆసియాలోని అతిపెద్ద చికెన్ మండీ అయిన ఢిల్లీలోని ఘాజీపూర్ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.
కొన్ని వందల చికెన్ షాపులు దారుణంగా అమ్మకాలు లేక షట్టర్ క్లోజ్ చేసి ఉన్నాయి.
మూడురోజులుగా మూతపడింది ఈ మార్కెట్.
పౌల్ట్రీ సంబంధిత వ్యాపారాలన్నింటిపై పది రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే. దీంతో గుడ్లు కోళ్లు ఎక్కడా అమ్మకాలు లేవు, ఇక రెస్టారెంట్లలో అమ్మకాలు లేవు. దాదాపు వేలాది మంది వ్యాపారులు కూలీలు ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారు.