గూగుల్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. తాజాగా రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది.. 2021, జనవరి 14వ తేదీ గురువారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో తాజాగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ నిషేధం ఎప్పటి వరకూ అమలు అంటే దాదాపు ఈనెల 21 వరకూ అమలులో ఉంది, తర్వాత పరిస్తితి బట్టీ నిర్ణయం తీసుకుంటారు.. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది.. ఎన్నికలు మొత్తం పూర్తి అయిన తర్వాత రాజకీయ ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక తాజాగా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ విషయం సున్నితమైన అంశం అందుకే ఈ నిర్ణయం తీసుకుంది.. దీనిపై చాలా మంది ఇది మంచి నిర్ణయం అని తెలియచేస్తున్నారు.