శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది… ఇక అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం చూస్తున్నారు..ఆకాశంలో ఆ అద్భుతం కనిపించగానే భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం రానుంది, భక్తుల సంఖ్య తగ్గింది అనే చెప్పాలి.
ఈసారి మకర విలక్కు పండగపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే శబరిమల చరిత్రలో అతి తక్కువ మందితో జరుగుతున్న పూజలు అనే చెప్పాలి..
ఈరోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం వస్తారు..అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టును తీసుకువెళ్లాలి.