బైక్ పై వెళ్లిన సమయంలో సిగ్నల్ జంప్ చేసినా హెల్మెట్ లేకపోయినా ఆర్సీ సీ బుక్ లైసెన్స్ పొల్యుషన్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఫైన్లు వేస్తారు, ఇక సిగ్నల్ జంప్ చేసినా రాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఇలా దొరికితే భారీగా ఫైన్లు కట్టాల్సిందే .
ఇలా ఫైన్లు వెయ్యి నుంచి 10 వేల వరకూ విన్నాం …కాని ఓ చోట మాత్రం బైక్ కు ఏకంగా రూ.1.13 లక్షల జరిమానా విధించారు. ఒడిశా రాష్ట్రం రాయగడ డీవీఐ జంక్షన్ వద్ద పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఈ సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి డ్రమ్ములు అమ్ముతూ వచ్చాడు. బైక్ పై 8 డ్రమ్ములు కట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్నాడు.
అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు, ఇక అతని బైక్ కి రిజిస్ట్రేషన్ కూడా లేదు, దీంతో అతనికి ఏకంగా లక్షా 13వేల రూపాయలు జరిమానా విధించారు అధికారులు.. దీంతో అతను షాక్ అయ్యాడు. ఇలా ఫైన్లు వేయడంతో దీనిపై సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.