దేశంలో ఈ కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది, ఇక అన్నీ రాష్ట్రాలకు ఇప్పటికే డోసులు చేరుకుంటున్నాయి, మరి ఈనెల 16 నుంచి వాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వనుంది.. మరి తెలంగాణలో కూడా ఈ నెల 16న టీకా వేయనున్నారు.
తాజాగా తొలిటీకా ఎవరికి ఇస్తారు అంటే ఓ పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి ఈ తొలి కరోనా టీకా ఇవ్వనున్నారు, ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు ఇవ్వనుంది ప్రభుత్వం, ఈ కరోనా సమయంలో లో విశ్రాంతి లేకుండా పని చేశారు వైద్యులు పారిశుద్యకార్మికులు.. వారికి టీకాలు అందివ్వనున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాలు వేస్తే, సమస్యలపై అవగాహన వస్తుందని తొలివారం ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకాలు వేయనున్నారు… మొత్తం డేటా అంతా యాప్ లో పొందుపరుస్తారు.. దేశ వ్యాప్తంగా ఎంత మందికి టీకా వేశారు అనేది కూడా ప్రతీ నిమిషం తెలుసుకుంటుంది ప్రభుత్వం.