మనిషికి నీరు ప్రాణాధారం.. మనకు పంట పండాలి అన్నా నీరు ఉండాలి.. అసలు మనిషి బతకాలి అన్నా నీరు ఉండాల్సిందే.. ఇక శరీరంలో చూసినా 70 శాతం నీరు ఉంటుంది, అయితే రాగి పాత్రల్లో బాటిళ్లల్లో గ్లాసుల్లో నీళ్లు తాగేవారు పెద్దలు… కాని మనం ఈ రోజుల్లో మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగుతున్నాం.
ఇప్పుడు యూవీ ఫిల్టర్లు, ఆర్ఓ ప్యూరిఫైయర్లు బాగా పాపులర్ గా ఉన్నాయి, ఇక కొందరు రాగి బిందెల్లో నీళ్లు తాగుతున్నారు.. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇలా రాగి గ్లాసులు చెంబులు పాత్రలలో నీరు తాగితే లాభాలు ఏమిటి అనేది చూద్దాం.
జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.. బరువు దూరం అవుతుంది, శరీరానికి గాయాలు కూడా మానతాయి..
యవ్వనంగా ఉంటారు, గుండెకి కూడా చాలా మంచిది, కాన్సర్ రిస్క్ దూరం అవుతుంది
ఆర్థ్రరైటిస్ కి మంచి రెమెడీ. శరీరం చాయ వస్తుంది.