ఇక మనం ఇడ్లీ తిన్నా వడ తిన్నా ఇలా ఏది తిన్నా మినుములతోనే తయారు అవుతాయి, వాటిని నానబెట్టి పిండి చేసి చేస్తారు, అయితే దీని వల్ల శరీరానికి మంచి జరుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు..
శరీరానికి అధిక మొత్తంలో ఐరన్ లభిస్తుంది. మినుముల్లో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
గర్భిణీలు మినువులతో చేసిన పదార్దాలు తీసుకోవచ్చని అంటున్నారు..రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. ఎముకలు బలంగా మారతాయి, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
ఇక గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి..మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. షుగర్ సమస్య రాదు అంటున్నారు, గ్లూకోజ్ స్ధాయిలు నియంత్రిస్తుంది రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగకుండా ఉంటాయి. యాంటియాక్సిడెంట్ల వల్ల కడుపులో మంట తగ్గుతుంది.