రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లో ఎమ్మార్పీ కంటే కొందరు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారు, దీంతో ఇదేమిటి అని ప్రశ్నిస్తే మా ఇష్టం అంటున్నారు కొందరు వ్యాపారులు.. దీంతో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇలా అడ్డంగా బిల్లు వేస్తే రేట్లు ఎక్కువ అమ్మితే వదలడం లేదు.
ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రోహిత్ పాటిల్ నేషనల్ హైవే దగ్గర ఓ హొటల్ కు వెళ్లాడు అక్కడ వాటర్ బాటిల్ కొన్నాడు.. నీటిబాటిల్ ధర 20 రూపాయలు కాని ధర 164 వేశారు దీనిపై ప్రశ్నించారు.
దీనిపై వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు, దీనిపై హోటల్ వారికి నోటీసులు వచ్చాయి, హోటల్ సర్వీస్ బట్టీ అంత బిల్లు వేశాము అని చెప్పారు.. కాని ఇది అత్యంత ఎక్కువ రేటు, సో ఇక దీనిపై హోటల్ వారు 5500 అతనికి చెల్లించాలి అని చెప్పారు. ఇక ఆ నగదు కూడా స్వచ్ఛంద సంస్థకు అందజేస్తానని చెప్పాడు రోహిత్ పాటిల్ .