పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఇక వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది …ఇక వకీల్ సాబ్ టీజర్ కూడా దుమ్ము దులిపేస్తోంది..ఇక ఇందులో ఆయన లాయర్ పాత్ర చేస్తున్నారు, ఇక తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్నారు మరో సినిమా..
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే , ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది, ఈ సినిమాకి దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించనున్నారు.
గతంలో తీన్మార్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు సాయం అందించారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాకి కూడా మాటలు అందించనున్నారు ఆయన… ఇక తాజాగా శాకుంతలం సినిమాకి కూడా మాటలు అందిస్తున్నారట, అంతేకాదు అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రానికి మాటలు అందిస్తున్నారు త్రివిక్రమ్.