మన దేశంలో ఓ పక్క కరోనా మరోపక్క కొత్తగా వచ్చిన ఈ బర్డ్‌ఫ్లూ అందరిని భయపెడుతోంది, ముఖ్యంగా చికెన్ గుడ్డు తినాలి అంటే జంకుతున్నారు జనం.. ఈ సంక్రాంతి కనుమ ముక్కనుమ అంటే ముక్క లేనిదే జనం ఫుడ్ తినరు.. అలాంటిది కోడిపందాల దగ్గర కోళ్లను కూడా వదిలేశారు చికెన్ తినడం చాలా మంది తగ్గించేశారు.
నిజంగానే చికెన్, గుడ్లు తింటే బర్డ్ ఫ్లూవస్తుందా? అనే విషయంపై నిపుణులు తాజాగా జరిపిన పరిశోధనల బట్టీ ఏం చెబుతున్నారు అంటే ..చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందన్న వార్తల్లో నిజం లేదు. అధిక వేడి మీద చికెన్ ని పసుపు వేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ నశిస్తుంది.
ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వైరస్ అనేది ఉంటే ఆ వేడికి చనిపోతుంది, ఇలా చేయాలి అంటే మినిమం మీరు వండే చికెన్ 70 డిగ్రీల సెల్సియస్ వేడిదగ్గర వండాలి అని తెలిపారు, సో మంచి పసుపు వేసి రెండు మూడు సార్లు చికెన్ కడిగి ఇంత వేడిలో వండితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.