మనం పాముని చూస్తే వణికిపోతాం అక్కడ పాము ఉంది అంటే ఆమడ దూరం పారిపోతాం, అయితే పాముని చూస్తే ఎవరైనా భయపడిపోతారు, ఇక ఓ వ్యక్తి ఏకంగా పాముతో 72 గంటలు గడిపి అందరిని ఆశ్చర్య పరిచారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇది నమోదు అయింది.
పుణెకు చెందిన నీలం 28 ఏళ్ల వయస్సులోనే పాములతో ప్రేమలో పడ్డాడు, వాటిని ఎవరైనా చంపితే చాలా బాధపడేవాడు వాటికి ఏ హాని చేయవద్దు అని కోరేవాడు.. ఇక ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ ఆలోచన వచ్చింది.
విష సర్పాలతో నిండిన గాజు చాంబర్‌లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటరిగా మూడు రోజులు గడిపాడు. ఈ సమయంలో అతని దగ్గరకు అవి వచ్చేవి కాని అతను ఏ భయం లేకుండా అలాగే ఉన్నాడు, ఇక అతనిని కాటు వేయలేదు..1982లో కాట్రాజ్ స్నేక్ పార్క్‌ను నిర్మించాడు. ఇలా అతను నాటి నుంచి చేసిన పనితో అది రికార్డులోకి ఎక్కింది.