మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ఎంతో మంది చర్చించుకుంటున్నారు, ముఖ్యంగా ఇటీవల
వివాదాస్పద ప్రైవసీ పాలసీ తీసుకువచ్చింది, దీనిపై వరల్డ్ వైడ్ విమర్శలు వస్తున్నాయి, దీనిని ఆపాలి అని కోరుతున్నారు అందరూ… దీంతో కంపెనీ వెనక్కి తగ్గింది ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ను మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ సమయంలో చాలా మంది వాట్సాప్ కాకుండా ఈ నెల రోజుల నుంచి ప్రత్యర్థి యాప్‌లు సిగ్నల్, టెలిగ్రామ్‌లకు మారుతున్నారు, ఈ సమయంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది, అయితే ఫ్రిబ్రవరి 8 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రావాలి కాని మరో మూడు నెలలు వెనక్కి వెళ్లింది.
కొత్త పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని ఎవరి ఖాతాలు రద్దు చేయము అని తెలిపింది, అయితే వాట్సాప్ ప్రైవసీ పాలసీలో భాగంగా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌లను ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే మీ వాట్సాప్ ఖాతా కొనసాగుతుంది అని తెలిపింది.. దీంతో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది కంపెనీ. చూడాలి మరో మూడు నెలల వరకూ అయితే బ్రేకులే.