శరీరానికి పోషకాలు చాలా అవసరం ముఖ్యంగా గుడ్డు తీసుకుంటే చాలా మంచిది… ఇక చలికాలంలో కూడా చాలా మంది గుడ్డు ఎక్కువగా తీసుకుంటారు.. ఇది శరీరానికి మంచిది, ఇక శరీరానికి వెచ్చగా ఉంటుంది, ఇతర లాభాలు ఉన్నాయి.
శీతాకాలం రోజుకి ఓ ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటే ఎంతో మంచిది.. ఇలా తింటే శరీరం నిత్యం వెచ్చగా ఉంటుంది, దీని వల్ల రోజుకి ఏడు గ్రాముల ప్రొటీన్ లభ్యం అవుతుంది.. గుడ్డు తింటే శరీరానికి అవసరం అయిన యాంటీబాడీలు తయారు అవుతాయి.
గుడ్డులోని జింక్ ఈ కాలంలో ఎక్కువగా వేధించే జలుబును నివారిస్తుంది.ఇక రోజుకి ఓ గుడ్డు తింటే విటమిన్ డీ లోపం ఉండదు, ఇక రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రోజుకి ఓ గుడ్డు తింటే మంచిది రెండు మూడు తింటే మాత్రం ఊబకాయం కొవ్వు సమస్య పెరుగుతుంది.