ఓ పక్క జబర్దస్త్ జడ్జిగా.. మరోపక్క ఎమ్మెల్యేగా రోజా ఎంతో బిజీగా ఉంటారు, ఇటు షూటింగులు అటు రాజకీయంగా ప్రజా సేవల్లో ఆమె నిత్యం బిజి బిజీగా ఉంటారు, అయితే ఇటు కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తారు ఆమె… డేట్స్ ఎక్కడా క్లాష్ కాకుండా చూసుకుంటారు.
అయితే టాప్ హీరోయిన్ గా కొనసాగిన రోజాకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె తో నటించిన వారి పేరు చెబుతుంది అని అనుకుంటున్నారా కాదు….ఆమెకి నచ్చిన హీరో రవితేజ అట, ఆయన నటన అంటే ఆమెకి చాలా ఇష్టం.
రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తుంటానని.. ప్రతీ సినిమాను ఎంజాయ్ చేస్తానంటున్నారు ఆమె, ఇక అతని కామెడీ యాంగిల్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు, ఇక చిన్నతనంలో కృష్ణగారు అంటే ఇష్టం ఉండేది తర్వాత ఇప్పుడు రవితేజ అంటే ఇష్టం అని తెలిపారు ఆమె.. ఇక రామ్ చరణ్ కు కూడా రవితేజ అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్న హీరో రవితేజ అనే చెప్పాలి.