2020 నుంచి మన దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించింది.. ఇక ఈ ఏడాది తొలి నెలలో గుడ్ న్యూస్ ఏమిటి అంటే కరోనా టీకా వచ్చేసింది, ఇక మన దేశంలో కోట్లాది డోసులు సిద్దం అయ్యాయి, అన్నీ రాష్ట్రాలకు ఇప్పటికే పంపించడం జరిగింది. తొలిగా వాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నారు.
ముందుగా డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే టీకాను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక వారికి అందరికి ఈ టీకాని అందిస్తున్నారు, ఇక రాజకీయ నేతలు కూడా ఇంకా ఈ టీకా తీసుకోలేదు, ముందు ప్రజల ప్రాణాలు కాపాడటానికి అంత కష్టపడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ టీకాలు ఇస్తున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ టీకాను ఎప్పుడు తీసుకుంటారు? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి, తాజాగా దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. ముందు ఈ టీకాలు కరోనా సమయంలో యోధులకు ఇస్తున్నాం, తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాను ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని ఆ జాబితాలో ప్రధాని మోదీతో పాటు రాజకీయ నేతలు కేంద్రమంత్రులు అందరూ ఉంటారు అని తెలిపారు.