దుంప ఆహారం చాలా బలమైన ఆహారం.. అందుకే మనం ఈ దుంప కూరలు ఎక్కువగా తింటాం ..ఇక నార్త్ సైడ్ అయితే కచ్చితంగా రోజూ ఆలూ కూర కనిపిస్తుంది, ముఖ్యంగా రోటీ చపాతీలకు ఈ కూర ఫస్ట్ ఉంటుంది.చిలగడదుంపల్లో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.
చిలగడదుంపలో ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు మీ ఆరోగ్యానికి చాలా మంచిది. చిలగడదుంపలో మంచి పోషకాలు ఉంటాయి, జీర్ణవ్యవస్ధ ఇబ్బంది ఉండదు మలబద్దకం కూడా ఉండదు, ఇక బీపీ సమస్య రాకుండా చూస్తుంది. ఇవి వారానికి రెండు సార్లు తీసుకున్నా మనకు కాన్సర్లు రాకుండా కాపాడతాయి.
చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది… దద్దుర్లు లాంటివి తగ్గుతాయి, ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉండదు, ఇక బాగా ఆకలి అనేది వేయదు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది,
గమనిక
ఇది అందరికి పడదు ఒకవేళ మీకు తింటే అలర్జీలాంటివి వస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.