మన దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఇప్పటికే టీకాలు అందిస్తున్నారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు అందిస్తున్నారు, అయితే తర్వాత దశలో మిగిలిన వారికి అందిస్తారు, ఇక మన దేశంలో ఈ టీకాలు బాగానే పని చేస్తున్నాయి, ఇక ఇతర దేశాలు కూడా ఈ టీకాలు కావాలి అని కోరుతున్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉచితంగా సరఫరా చేయనుంది.. మన దేశంలో తయారు అయిన టీకాలని . ఆరు దేశాలకు టీకాలను అందించనుంది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ లకు బుధవారం నుంచి వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నట్టు చెప్పింది.
అంతేకాకుండా మిగిలిన దేశాలకు కూడా, మనకు ప్రస్తుతం ఎంత అవసరం ఉందో చూసి దాని బట్టీ మన అవసరాలు తీరిన తర్వాత మరికొన్ని టీకాలు వారికి అందిస్తారు..గతంలో చాలా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్, రెమ్డెసివిర్ ట్యాబ్లెట్లనూ ఇచ్చి సాయం చేసింది మన దేశం. అలాగే మాస్కులు వెంటిలేటర్లు ఇలా టెస్టు కిట్లు కూడా సాయం చేశారు, ఇక తాజాగా ఈ టీకాలపై శిక్షణ కూడా ఇవ్వనున్నారట.