మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కావాలి అనే కోరిక ఉందా, అయితే మీకు ఓ మంచి ఆఫర్ …మీరు ఈ భోజనాన్ని పూర్తిగా తినేస్తే చాలు. మీకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇస్తారు… మరి ఈ ఆఫర్ ఎక్కడ అని అనుకుంటున్నారా, పుణె శివారులోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో గల శివరాజ్ హోటల్లో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు..
హోటల్ వ్యాపారం ఈ కరోనా సమయంలో దారుణంగా పడిపోయింది… ఈ సమయంలో మళ్లీ వ్యాపారం పుంజుకోవాలని ఈ వ్యాపారి సరికొత్త ఆలోచన చేశారు….బుల్లెట్ బైక్ కంటెస్ట్ ప్రకటించింది. వీరు పెట్టే మాంసాహర భోజనాన్ని కేవలం 60 నిమిషాల్లోనే పూర్తి చేసేయాలి. ఇందులో 4 కిలోల మటన్, చేపలతో తయారు చేసిన 12 రకాల వంటకాలు ఉంటాయి. ఇవన్నీ గంటలో తింటే మీకు బైక్ ఇస్తారు.
ఇక ఈ ఫుడ్ ధర 2500 రూపాయలు.. చికెన్ చేపలు మటన్ ఫ్రై రొయ్యల బిర్యానీ ఇలా అనేక రకాల ఫుడ్ ఇస్తారు,
ఇలా గంటలో ఈ ఫుడ్ తినేస్తే రూ.1.65 లక్షలు విలువ చేసే బుల్లెట్ను తీసుకువెళ్లవచ్చు.. ఈ ఆఫర్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఇక బయట బ్యానర్లు కట్టారు… ఇక ఇప్పటికే ఓ వ్యక్తి బులెట్ సాధించాడు, మొత్తం ఐదు బైక్ లు ఆఫర్ గా ఇస్తున్నారు హోటల్ లో…. సోలాపూర్కు చెందిన సోమ్నాథ్ పవర్ 60 నిమిషాల లోపే ఈ ఫుడ్ తిన్నాడు ఓ బైక్ ని ఇంటికి తీసుకువెళ్లాడు.