బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అతి తక్కువ సమయంలోనే చిత్ర సీమలో మంచి పేరు సంపాదించుకున్నాడు,…ఎక్కడో బీహర్ లోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి బీ టౌన్ లో మంచి హీరో అయ్యాడు సుశాంత్ …ఇటీవల అనుమానస్పద రీతిలో మృతి చెందారు.
టీవీ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్లో హీరోగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది …ఇక ఆయన మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. కై పో చే, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ, కేదార్నాథ్ చిత్రాలు మంచి పేరును తెచ్చాయి.
ఇక తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది అనే చెప్పాలి…దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఆండ్రూస్ గంజ్లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు పెట్టారు, ఇక్కడ చాలా మంది
బిహార్ ప్రాంతం వారు ఉంటారు..ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంపునకు దారి తీసే రోడ్డుకు సుశాంత్ సింగ్ మార్గ్ అని పేరు పెట్టారు…. అతని అభిమానులు ఈ విషయం తెలిసి చాలా ఆనందంలో ఉన్నారు.