అగ్రరాజ్యం అమెరికాకి కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వచ్చారు.. పాత అధ్యక్షుడు ట్రంప్ తన పదవి నుంచి దిగిపోయారు, అయితే పాత అధ్యక్షుడికి మరి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వేతనం కింద నెలకు 400,000 మిలియన్ డాలర్లు పొందుతారు. ఇక వీరు ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే వ్యక్తిగత విమానం ఇస్తారు, ఇక ప్రత్యేక ఇంటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు.. ఈ సమయంలో మరో ప్రాంతంలో సొంతగా ఆఫీస్, నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
7 నెలల పాటు మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీసు అద్దె, టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రింటింగ్, పోస్టల్ సేవలు ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుంది, తర్వాత వారే చూసుకోవాలి. ఇక మాజీ అధ్యక్షుడికే కాదు ఆయన జీవిత భాగస్వామికి కూడా అమెరికా ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. ఏడాదికి 20 వేల డాలర్లు అందిస్తారు, ఇక వారికి మరే ఫించన్లు రాకూడదు.. మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తారు…మాజీ అధ్యక్షులకి జీవిత కాలం రక్షణ ఉంటుంది. గతంలో వారు తీసుకున్న నిర్ణయాల వల్ల వారికి ఎలాంటి శత్రువులు అయినా ఉంటారు, అందుకే ఇలా జీవిత కాలం రక్షణ ఇస్తారు..