ఇప్పటి వరకూ వారానికి రెండు రోజులు సెలవు మాత్రమే ఉంది .. అయితే కొన్ని దేశాల్లో వారానికి మూడు రోజుల సెలవు ఇవ్వాలి అని డిమాండ్ వినిపిస్తోంది.. ఉద్యోగులు కూడా ఇలా సెలవు మూడు రోజులు ఉంటే పని కూడా చాలా వేగంగా జరుగుతుంది అని ఉత్పాదకత పెరుగుతుంది అని చెబుతున్నారు.. కంపెనీలు సర్వే చేసినా ఇదే తెలియచేశారు.
అయితే జపాన్లోని మైక్రోసాఫ్ట్ ఆగస్టు 2019లో మూడు రోజుల సెలవు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి అద్భుత విజయం సాధించింది. గతంలో కంటే 40 శాతం వర్క్ వేగంగా చేశారు, అయితే తాజాగా జపాన్ లోని ఈ విధానం అమలు చేయాలి అని కోరుతున్నారు ఉద్యోగులు.. దీనిని చట్టం చేయాలి అని డిమాండ్ వినిపిస్తోంది జపాన్ లో.
జపాన్లో నాలుగు రోజుల పనిదినం, మూడు రోజుల సెలవు దినాల ప్రయోగం విజయవంతం కావడంతో ఇక్కడ గత నెల నుంచి దీని గురించే అందరూ మాట్లాడుతున్నారు, కోవిడ్ రావడంతో దీనికి బ్రేకులు పడ్డాయి గతంలో. ఇక ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక చాలా దేశాల్లో దీనిని అమలు చేయాలి అని చూస్తున్నారు.