చిత్ర సీమలో సౌత్ ఇండియా నుంచి దర్శకుడు శంకర్ దేశంలో మంచి పేరు సంపాదించుకున్నారు… దేశంలో గొప్ప దర్శకుల్లో శంకర్ ఒకరు, తన కథకు తగ్గ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు ఆయన , ఇక ఆయనతో సినిమా అంటే ఎవరైనా ఒకే చెబుతారు, ముఖ్యంగా దర్శకుడిగా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది, ఆయన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశాయి.
కమల్ హాసన్తో భారతీయుడు 2 చిత్రం తెరకెక్కించి మళ్ళీ ట్రాక్ ఎక్కాలని భావించారు, ఇక ఈ సినిమా వర్క్ జరుగుతూ ఉంది, అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ స్టోరీకి ప్లాన్ చేస్తున్నారట, ఈసారి మల్టీస్టారర్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఇటీవల ఓ వార్త వినిపించింది టాలీవుడ్ లో కోలీవుడ్ లో.
పవన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా ఉండబోతుందని తమిళ మీడియాలో వార్తలొచ్చాయి.కాని తాజాగా మరో వార్త వినిపిస్తోంది, పవన్ కల్యాణ్ కేజీఎఫ్ స్టార్ హీరో యష్ తో కలిపి శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట, మరి ఈ వార్తలు ఎంత వరకూ వాస్తవమో చూడాలి.