అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టారు, నిర్మాణానికి విరాళాల సేకరణ కూడా జరుగుతోంది. కోట్లాది మంది రామ భక్తులు ఈ విరాళాలు అందచేస్తున్నారు.. ఇక సామాన్యుల నుంచి కోటీశ్వరులు వ్యాపారులు చాలా మంది భారీ విరాళాలు ఇస్తున్నారు.
- Advertisement -
రామ మందిరం నిర్మాణానికి తన వంతు సాయంగా రూ.30 లక్షలు విరాళంగా ప్రకటించారు జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్. తాజాగా నేడు తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన ఈ విరాళం అందించారు, ఈ విరాళం చెక్కును శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్కు అందజేశారు.
నేను కూడా నా వంతు కృషిగా రూ.30 లక్షలు రామాలయం నిర్మాణానికి ఇస్తున్నాను. అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళం ఇచ్చి సహకరించాలి అని కోరారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ విరాళాలు అందిస్తున్నారు.