కొన్ని ఉద్యోగాలు చాలా విచిత్రంగా ఉంటాయి.. ఈ ఉద్యోగాల గురించి వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, పెద్ద ఉద్యోగంలో కష్టం లేకపోయినా కొందరికి లక్షల జీతాలు కూడా వస్తూ ఉంటాయి, అయితే ఇప్పుడు ఓ ఉద్యోగం అందరిని ఆకర్షిస్తోంది, మంచి జీతంతో పాటు సౌకర్యాలు బాగానే ఉన్నాయి.
ఆఫీసుకి వచ్చి చేసే ఉద్యోగం ఏమిటి అంటే, నాలుగు రకాల ఐటమ్స్ ను రుచి చూడటమే పని. నెల తిరిగేసరికి లక్షల్లో జీతం మీ ఖాతాలో ఉంటుంది. నిజమే క్యాండీ ఫన్ హౌస్ అనే చాక్లెట్ కంపెనీ ఉంది, ఈ కాండీలు మార్కెట్లో చాలా ఫేమస్ , అయితే అవి టేస్టీగా ఉన్నాయా లేదా అనేది ఉద్యోగి టేస్ట్ చేయాలి..
క్యాండియాలజిస్ట్స్ అని ఆ ఉద్యోగులను పిలుస్తుంటారు. తాజాగా కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది, మీకు క్యాండీలు అంటే ఇష్టం ఉండాలి, బాగా టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది చెప్పాలి, అందులో తప్పులు ఉన్నా టేస్ట్ బాగోపోయినా వెంటనే కనిపెట్టిచెప్పాలి. సుమారు 3000 రకాల క్యాండీలను టేస్ట్ చేసి, ఎలా ఉన్నాయో చెప్పడమే మీపని.. మరి జీతం ఎంత అనుకుంటున్నారు గంటకి 3400 మన కరెన్సీలో రోజుకి 20 వేలు జీతం వస్తుంది అంటే నెలకి 6 లక్షలు.