సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఉన్నారు.. అయితే కొందరు హిట్ అయ్యారు మరికొందరు అంతే వేగంగా సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్లిపోయారు.. ఇంకొందరు హిట్ కోసం చూస్తున్నారు, అయితే గతంలో చాలా మంది సీనియర్ హీరోలు తమ పిల్లలను చిత్ర సీమలోకి తీసుకువచ్చారు.. నేడు నటులు కొందరు ఎంకరేజ్ చేస్తుంటే మరికొందరు మాత్రం వారికి నచ్చిన రంగంలోకి ఎంటర్ అవుతున్నారు.
తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, హీరో నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వారసుడు బాలాజీ ప్రసాద్ను హీరోగా పరిచయం ఎందుకు చేయలేకపోయారు అంటే కారణం ఉంది. కుమారుడ్ని చిత్ర సీమలోకి తీసుకురావాలి అని రాజేంద్రప్రసాద్ కి కోరిక ఉండేదట..
ఓ సినిమాని రాఘవేంద్రరావు దర్శకుడిగా నిధి ప్రసాద్ నిర్మాతగా ప్రారంభించారు కాని ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో ఆయన కుమారుడు ఇక సినిమాలు మళ్లీ చేయలేదు.. తర్వాత కధలు వినిపించిన ఒకే చేయలేదట.
తనయుడిని సినిమాల్లోకి తీసుకురాలేకపోవడం రాజేంద్ర ప్రసాద్కు మాత్రం ఇప్పటికీ తీరని కలే అంటారు ఆయన సన్నిహితులు, అయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా… సినిమాల్లోకి రాకపోయినా మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించారుబాలాజీ ప్రసాద్… ప్రస్తుతం విదేశాలకు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు.