మనం తరచూ వింటూం ఉంటాం ఒకే గ్రామానికి చెందిన చాలా మంది లారీ డ్రైవర్లు ఆర్మీ ఉద్యోగులు టీచర్లు పోలీసులు ఇలా ఒకే ప్రాంతంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చాలా సార్లు వినే ఉంటాం.. కొన్ని గ్రామాలు మనం విన్నాం చూశాం.. మరికొన్ని గ్రామాల్లో చాలా మంది దుబాయ్ మస్కట్ లాంటి దేశాలకు వెళ్లిన వారు ఉన్నారు.. అయితే ఈ గ్రామం గురించి కూడా ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.
నారాయణపేట జిల్లాకు చెందిన ఓ గ్రామంలో ఛాయ్వాలాలు ఎక్కువ. దామరగిద్ద మండలం ఎల్సంపల్లె గ్రామానికి చెందిన 70 మంది టీ విక్రయిస్తూ నగరంలో ఉపాధి పొందుతున్నారు, అంతేకాదు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు, ఈ గ్రామం ఇలా ఛాయ్ వాలాలతో ఫేమస్ అయింది.
నగరానికి వచ్చిన వీరు రోజుకు కనీసం రూ.1000 సంపాదిస్తున్నారు. దీంతో వీరిని స్ఫూర్తిగా తీసుకొని పరిసర గ్రామాలకు చెందిన యువకులు సైతం టీ స్టాల్లు పెట్టుకుంటున్నారు, వీరు అందరూ హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో టీస్టాల్ పెట్టుకున్నారు, నిత్యం పని ఉంటుంది పైగా వెంటనే నగదు వచ్చే వ్యాపారం… అప్పులు ఉండవు తక్కువ పెట్టుబడి దీంతో మంచి టీ మాస్టర్లుగా మారుతున్నారు ఇక్కడ చాలా మంది యువకులు.