బంగారం ధర మళ్లీ పెరిగింది గత పది రోజులు నుంచి తగ్గుతూ పెరుగుతూ ఊగిసలాడుతున్న పుత్తడి ధర మళ్లీ నేడు జిగేల్ మంది.. మరి కొత్త ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం. మరి హైదరాబాద్ లో వెండి బంగారం ధరలు నేడు మార్కెట్లో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో రేటు రూ.50,230కు చేరి అమ్మకాలు జరుగుతున్నాయి. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరిగింది. రూ.46,050కు చేరి ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర చూశాం, ఇక వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. దీంతో వెండి ధర రూ.71,300 దగ్గర ట్రేడ్ అవుతోంది, ఇక బంగారం వెండి ధరలు రేట్లు చూశాం, అయితే వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.