అతిగా ఏది తిన్నా అనర్దమే అందుకే ఏది నచ్చినా అతిగా తినేయకూడదు అంటారు పెద్దలు, అయితే ఇక్కడ కొందరు చేసిన పని పెను వైరల్ అవుతోంది చైనాలో… విమానంలో అదనపు లగేజీకి ఎక్కువ చార్జ్ చేస్తారనే కారణంతో నలుగురు వ్యక్తులు 30 కిలోల నారింజ పండ్లు తిన్నారు… దీంతో వారి బాధలు మాములుగా లేవు.
చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన నలుగురు వ్యక్తులు విమానం ఎక్కేందుకు వచ్చారు.. లగేజీగా 30 కిలోల నారింజ తెచ్చారు, అయితే వాటి ధర కంటే లగేజీ చార్జ్ ఎక్కువ ఉంది సుమారు 4000 చార్జ్ పెట్టాలి అని తెలిపారు సిబ్బంది.
దీంతో ఇక వీటిని పాడేయడం ఇష్టం లేక వదలడం ఇష్టం లేక వారు నలుగురు అరగంట సమయంలో వాటిని తినేశారు…మొత్తానికి తెలివైన పని చేశాం అనుకున్నారు.. కాని తిన్నా గంటకి అర్ధం అయింది కడుపులో ఇబ్బందితో పాటు నోటిలో పూతలు వచ్చాయి.. వైద్యుల దగ్గరకి వెళ్లాల్సి వచ్చింది.. సో ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయద్దు అంటున్నారు వైద్యులు.