మన దేశంలో అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి.. ఒకవేళ ఎవరికి అయినా లేకపోయినా కొత్తగా కచ్చితంగా తీసుకోవాల్సిందే… మరీ ముఖ్యంగా ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆధార్ అవసరం.. ఏ పథకం అమలు చేసినా కచ్చితంగా మీరు అర్హులు అయితే మీకు ఆధార్ ఉండాల్సిందే.. ఇక బ్యాంకు ఖాతా నుంచి అన్నీ కూడా ఆధార్ కు లింక్ అయి ఉంటున్నాయి.
మరి ఆధార్ కు మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి అని చాలా మందికి తెలియదు.. దీనికి అధికారులు కొన్ని కీలక విషయాలు చెబుతున్నారు..మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి. మీరు దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్కక్కర్లేదు.
మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి మీ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
మీ మొబైల్ నెంబర్, అడ్రస్, డోర్ నెంబర్ మార్పు, పేరులో తప్పులు ఉన్నా ఇలా మార్చుకోవచ్చు, మీ పుట్టిన తేది మార్పు అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉండాల్సిందే.