తెలుగులో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు బ్రహ్మానందం.. ఆయన దాదాపు 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు… అయితే చాలా మంది నటులు తమ వారసుల్ని చిత్ర సీమకు పరిచయం చేశారు అలాగే బ్రహ్మానందం కూడా తన కుమారుడిని చిత్ర సీమలోకి తీసుకువచ్చారు.
2004లో పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మీ.
ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి, అయితే సినిమా బాగున్నా పెద్దగా కలెక్షన్లు రాలేదు, తర్వాత
వారెవా– మను చిత్రాల్లో నటించాడు రాజా గౌతమ్. అయితే తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు ఆయన.
ఇక బ్రహ్మీరెండో కుమారుడు గురించి టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి… బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ , ఆయన విదేశాలలోఉన్నత చదువులు చదివారు, ఇక ఆయన హీరోగా రానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో, మరికొందరు మాత్రం ఆయన మంచి వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.