అది మెన్స్ హాస్టల్ గత రెండు నెలలుగా అన్నీ బాగానే ఉన్నాయి ఏ వస్తువులు పోలేదు, లాక్ వేయకపోయినా బాగానే ఉంటున్నాయి వస్తువులు, కాని ఈ మధ్య ప్రతీ రోజూ ఏదో ఒకటి పోతోంది ఏకంగా దండెం మీద వేసిన బట్టలు తీసుకుపోతున్నాడు, అలాగే వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు తీసుకుపోతున్నారు. ఇదేం దారుణం అని మొత్తం చూస్తే ఎవరూ దొరకలేదు.
ఇక సీసీ కెమెరాలు పెట్టించాడు ఓనర్.. ఓ వారం తర్వాత అసలు సీన్ బయటపడింది.. కొత్తగా ఓ వ్యక్తి హాస్టల్లో జాయిన్ అయ్యాడు.. అయితే రాత్రి సమయంలో దొంగచాటుగా వీటిని తీసేస్తున్నాడు, ఉదయం వాటిని త్రిపుల్ మార్కెట్ అని ఉంటుంది కదా అక్కడ అమ్మేస్తున్నాడు.. అంటే ఫ్యాంటు వంద చొక్కా 50 కి అమ్మేస్తున్నాడు.
ఇలా దొంగతనాలు వీడి హాబీ అట… సుమారు 1000 బట్టలు ఇలా అమ్మేశాడట… రెండు రోజులు బట్టలు అమ్మేసి ఆ డబ్బులతో హాస్టల్ ఫీజు కట్టి మళ్లీ నెల అయ్యాక వేరే హాస్టల్ కి వెళతాడట.. చివరకు పోలీసులకి అప్పగించారు ఈ కేటుగాడ్ని.