ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ మరో సినిమా చేయనున్నారా ?

-

2020 ఏడాదిలో ఎన్నడూ లేనంతగా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చారు ప్రభాస్, నాలుగు చిత్రాలు ఒకే చేశారు అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అయితే విడుదలకు సిద్దంగా ఉంది రాధేశ్యామ్… ఇక ఆది పురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా ఇలా అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు ఆయన.. ఇక 2022 వరకూ ప్రభాస్ ఈ సినిమాలతో ఫుల్ బిజీ అనే చెప్పాలి.

- Advertisement -

అయితే తాజాగా హృతిక్ రోషన్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ యాక్షన్ చిత్రం చేయబోతున్నారట. ఈ వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది… అక్కడ చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు… ఈ యాక్షన్ మూవీకి ప్రభాస్ సెట్ అవుతారు అని భావిస్తున్నారట దర్శకుడు.

ప్రస్తుతం షారుక్ ఖాన్తో పతాన్ తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్. దీని తర్వాత హృతిక్ రోషన్తో ఫైటర్ తెరకెక్కిస్తారు. ఇవి పూర్తి అయ్యేసరికి ప్రభాస్ కు దాదాపు రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.. ఆ తర్వాత ఈసినిమా ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి బీ టౌన్ లో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...