పామును చూస్తేనే చాలా మంది భయంతో పారిపోతారు.. అయితే ఇక 10 నుంచి 15 అడుగుల పాముని చూస్తే ఇక అటు వెళ్లడానికి కూడా భయపడతారు, అయితే త్రాచు నాగుపాములు మనకు తెలుసు ఇంకా విషం ఉండే కట్ల పాము తెలుసు. అయితే గిరినాగు అనే పాము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ పాములు గిరినాగులు చూడగానికి చాలా పెద్దగా ఉంటాయి.. ఇవి సుమారు 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకూ పెరుగుతూ ఉంటాయి… గిరినాగులు సాధారణంగా జనావాసాల్లోకి రావు. అవి ఎక్కువగా దట్టమైన అరణ్యాల్లోనే ఉంటాయి. ఇవి ఎక్కువగా దూరం వెళ్లవు అడవుల్లో చెట్ట మధ్య మాత్రమే అలా ఉండిపోతాయి.
వీటికి చాలా విషం ఉంటుంది. నాగుపాము కంటే 10 రెట్లు అధికంగా ఉంటుంది, కాటు వేస్తే 10 నిమిషాల్లో పోతారు, ఇవి బాగా విషం ఉండే పాములను, విషం లేని పాములను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పాములని ఆహారంగా తీసుకుంటాయి అది విచిత్రం.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో తూర్పు కనుమల్లోని అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా ఉంటాయి, ఇక తమిళనాడు కేరళలో కూడా వీటి సంఖ్య ఎక్కువ.
మగ, ఆడ గిరినాగులు ఏడాదిలో మార్చి నుంచి జూన్ నెలల మధ్య సంగమిస్తాయి. మగ గిరి నాగులను ఆకర్షించడానికి ఆడ గిరి నాగులు ప్రయత్నిస్తాయి. ఫెరామోన్స్ అనే ఒక విధమైన రసాయనాన్ని ఆడ గిరినాగు వదులుతుంది… ఎక్కడ వాసన ఉంటే అక్కడకు ఈ మగ గిరినాగులు వెళతాయి సంగమిస్తాయి.
Attachments area