బంగారం ధర ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరిగింది.. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పెరుగుదల నమోదు చేసింది. అయితే వెండి బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరగడంతో అమ్మకాలు మళ్లీ జోరు అందకున్నాయి, అయితే గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఇప్పుడు 9 వేల రూపాయల వరకూ బంగారం ధర తగ్గింది.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
ఈరోజు బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్లు 220 పెరిగింది 50180 కి ట్రేడ్ అవుతోంది, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 190 పెరిగింది….46,000 కి ట్రేడ్ అవుతోంది, బంగారం ధర నిన్నటి మీద కాస్త పెరుగుదల నమోదు చేసింది.
ఇక వెండి ధర చూస్తే సాధారణంగా ఉంది… నేడు పెరుగుదల లేదు తగ్గుదల లేదు.. నిన్నటి ధరకే వెండి అమ్మకాలు జరుగుతున్నాయి.. కిలో వెండి 74600 మార్కెట్లో ట్రేడ్ అవుతోంది… ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.