కొత్త ప్రైవసీ నిబందనలతో చాలా మంది వాట్సాప్ కు దూరం అవుతున్నారు, మిగిలిన యాప్స్ కు టర్న్ అవుతున్నారు, ఇక ప్రపంచ వ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వస్తోంది.. ఈ సమయంలో సిగ్నల్, టెలిగ్రామ్ల డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి, అయితే ఇలాంటి కొత్త పాలసీ అనౌన్స్ చేశాక మన భారతీయులు ఎంత మంది వాట్సాప్ కు దూరం అయ్యారు అనేది తాజాగా ఓ సర్వే వచ్చింది మరి అది చూద్దాం.
తాజా సర్వేలో 5 శాతం మంది భారతీయులు ప్రత్యామ్నాయ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారట. వీరు అందరూ గతంలో వాట్సాప్ యూజర్లే.. ఇప్పుడు వీరు వేరే ప్రత్నామ్నాయ యాప్ కు వెళుతున్నారు.. మొత్తం ఇండియాలో వాట్సప్ వాడే వారి సంఖ్య 40 కోట్లు ఉంటుంది ఇందులో రెండు కోట్ల మంది దూరం అయ్యారట.
వాట్సాప్ డేటాను ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీలతో పంచుకుంటే.. మేము వాట్సాప్ పేను కూడా వాడము అని చెబుతున్నారు చాలా మంది యూజర్లు.. ఈ ప్రైవసీ పాలసీతో మిగిలిన యాప్ లకి భారీగా డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి.