ఆడవారు చాలా మంది సీరియల్స్ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మన తెలుగులో చూసుకుంటే కార్తీక దీపం సీరియల్ కు ఎంతో పేరు ఉంది, ఇక దీనిని లక్షల మంది చూస్తున్నారు… ఇక ఇందులో క్యారెక్టర్లకు ఎంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాధ్ బాగా నటిస్తున్నారు. ఇక డాక్టర్ బాబు పాత్ర అలాగే వంటలక్క పిల్లలు శౌర్య, హిమ పాత్రలకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.
హిమ పాత్రలో నటించిన పాప పేరు సహృద. సీరియల్లో తండ్రి నుంచి ఎంతో ప్రేమను పొందిన సహృద నిజ జీవితంలో మాత్రం ఆ ప్రేమకు దూరం అయింది.. తాజాగా ఈ విషయాన్ని ఓ షోలో తెలిపింది.. ఇక ఆడపిల్ల పుట్టింది అని తండ్రికి ఇష్టం లేదట ఆమెని అస్సలు చూడలేదట.
తల్లి ఎంతో కష్టపడి సహృదను పెంచి పెద్ద చేసింది. అయితే ఇప్పుడు ఆమె స్టోరీ తెలిసి అందరూ షాక్ అయ్యారు, సీరియల్ లో ఇంత తండ్రి ప్రేమను పొందిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఆ ప్రేమకి నోచుకోలేదట.. అయితే పాత్ర కోసమే ఆమెని నల్లగా చూపిస్తారు కాని ఆమె చాలా కలర్ ఉంటుంది.