ఒకరిపై ప్రేమని వ్యక్తపరచాలి అంటే ముద్దు అనేది ముందు వినిపించే మాట.. అయితే ముద్దు అడిగారు కదా అని ఎవరికి పడితే వారికి ఇవ్వకండి.. ముద్దు వల్ల ముప్పు చాలా ఉందట.. వేరే వారితో అఫైర్లు పెట్టుకుని ముద్దుల్లో మునిగి తేలినా అక్రమ సంబంధాలతో చాలా మందికి ముద్దులు పెడుతున్నా సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు.
పాశ్చాత్య సంస్కృతిలో ముద్దు రొటీన్ అనేది తెలిసిందే… అయితే ముద్దుతో వచ్చే ఇబ్బంది ఏమిటి అనేది చూస్తే, పక్కవారికి అనారోగ్యం ఉండవచ్చు అలా ముద్దు ఇచ్చిన సమయంలో నోటిలోని లాలాజలం ఉమ్మి నుంచి అవతల వారికి వస్తుంది .
నోటి పూత వారికి ఉంటే వెంటనే వస్తుంది
జలుబు ఉన్నా వెంటనే వస్తుంది
నోటి పుండ్లు సమస్య ఉన్నా అంటుకుంటుంది ముద్దు వల్ల
మీకు కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం వంటివి కూడా ఇందులో ఉన్న వైరస్ ల వల్ల రావచ్చు
సర్పి అంటే హెర్పస్ కూడా రావచ్చు జాగ్రత్త
మెనింజైటిస్ ఫీవర్, తలనొప్పి వంటివి దీని వల్ల వస్తాయి
చిగుళ్ల నుంచి రక్తం కారటం అనే వ్యాధ ఉన్నా ముద్దు వల్ల వస్తుంది