చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతో ఇద్దరు కూతుళ్లను చంపుకున్నారు… ఇక ఈ కేసుపై లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు.. అయితే పెద్ద కుమార్తె అలేఖ్య గురించి అనేక విషయాలు తెలుస్తున్నాయి.
పెద్ద కుమార్తె అలేఖ్య భోపాల్లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైందట, ఈ సమయంలో ఆమె తరచూ అలాంటి తాంత్రిక పూజలు చేసేవారిని కలిసేది, అంతేకాదు ఆ మూడనమ్మకాలపై బాగా నమ్మకం పెట్టుకుంది.. ఈ లాక్ డౌన్ సమయంలో ఇవన్నీ తల్లిదండ్రులకి చెప్పింది, వారు కూడా కుమార్తె చెప్పిన విషయాలు నమ్మారు.
భోపాల్ దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్టు భావిస్తున్నారు. ఇక ఈ తొమ్మిది నెలల లాక్ డౌన్ సమయంలో ఇంటిలో ఉన్న అలేఖ్య తల్లి తండ్రి చెల్లికి అనేక విషయాలు చెప్పి ఆ పుస్తకాలు చదివింది. చివరకు కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మి ఇంత దారుణానికి ఒడిగట్టారు.