కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి పెరూ దేశంలో.. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది కలుగుతోంది..అక్కడ ఆక్సిజన్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ఇలా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఆక్సిజన్ కోసం ఎంతో ఇబ్బందిగా ఉంది.
దేశవ్యాప్తంగా జనం సిలిండర్ల సెంటర్ల దగ్గర ఎదురుచూస్తున్నారు. లిమా సమీపంలో ఉన్న ఓ ఆక్సిజన్ ఫ్యాక్టరీ దగ్గర ఏకంగా జనం క్యూ కడుతున్నారు… రాత్రి కూడా అక్కడే ఉంటున్నారు… సిలిండర్లపై తమ పేర్లు రాసుకుని క్యూలో ఉంటున్నారు.
ఉదయం వాటిని నింపిన తర్వాత తీసుకువెళుతున్నారు… ఇక ఇంత డిమాండ్ ఉన్నా ఇక్కడ ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించి అసలు ఆక్సిజన్ సిలిండర్ ధరలు పెంచలేదు అని చెబుతున్నారు… ఇక పోలీసులు ఫ్యాక్టరీ సిబ్బంది ఎవరికి ఇబ్బంది లేకుండా ముందు వచ్చిన వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తున్నారు.