ఒక్కొక్కరికి అదృష్టం చాలా సార్లు తలుపుతడుతుంది..లాటరీ తగిలిన తర్వాత వారి దశ ఎలా మారుతుందో తెలిసిందే… ఒక్కోసారి లాటరీ తగిలిన వారికే పలు సార్లు లాటరీ తగిలిన ఘటనలు చాలా చూశాం… అదృష్టవంతులు అయిన వారు ఇలా చాలా మంది ఉన్నారు….మరి ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి కూడా అంతే.
బ్రియాన్ మోస్ అనే వ్యక్తి అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందినవాడు… ఇప్పటి వరకూ ఐదు సార్లు లాటరీ వచ్చింది… తాజాగా నిన్ని మరో లాటరీ వచ్చింది….ఏకంగా 2,50,000 డాలర్లు సొంతం చేసుకున్నాడు. మనకు కరెన్సీలో చెప్పాలి అంటే 1 కోటి 82 లక్షలు. ఈ నగదుని సమాజం కోసం వినియోగిస్తాను అని తెలిపాడు.
ఇక ఇందులో సగం సమాజానికి… మిగిలిన సగం తన కుమార్తె చదువుకుని ఇంటి అవసరాలకు వాడుకుంటాను అని తెలిపాడు.. ఇక ఇలా అతనికి వరుసగా తగిలిన లాటరీల విలువ 5 నుంచి 7 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది అంటున్నారు అందుకే ఇతను లక్కీ పర్సన్ అంటారు.