ఇక హైవేల దగ్గర ప్రయాణం చేసే సమయంలో మీ ఫోర్ వీలర్స్ వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందే.. వాటి ద్వారా టోల్ చెల్లింపులు చేయాలి….ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పకుండా ఉండాలి, ఇక మీకు ఫాస్ట్ టాగ్ లేకపోతే మీరు టోల్ చెల్లింపులు చేయలేరు.
టోల్ ప్లాజాల దగ్గర రద్దీని తగ్గించేందుకు…వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా వెళ్లేందుకు దీనిని తీసుకువచ్చారు… అయితే ఇదంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ గా జరుగుతుంది, ఇక మీ వాహనానికి రిజిస్ట్రేషన్ వివరాలతో ఓ బార్ కోడ్ ఇస్తారు… ఈ బార్ కోడ్ మీరు వెహికల్ ముందు భాగంలో పెట్టుకోవాలి …ఇది స్టిక్కర్ గా ఉంటుంది… ఇది వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల వరకూ పని చేస్తుంది.
ఇక మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో టోల్ దాటుతుంటే అక్కడ ఈ వాహనం బార్ కోడ్ స్కాన్ చేస్తుంది ఓయంత్రం, ఇక మీ బార్ కోడ్ ని అది రీడ్ చేయడం వల్ల మీరు ఇచ్చిన డిజిటల్ వాలెట్ ద్వారా అందులో నుంచి నేరుగా నగదు కట్ అవుతుంది, ఇలా ఈజీగా చెల్లింపులు జరుగుతాయి.