అమెజాన్ కంపెనీ ప్రపంచంలో తెలియని వారు ఉండరు, ఇక దాని ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా అందరికి తెలిసిన వ్యక్తే. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తి ఉన్న వ్యక్తి కుబేరుడు, అయితే చాలా చిన్న గ్యారేజీలో అమెజాన్ ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ మేటీ కంపెనీగా మార్చారు ఆయన. ఇక తాజాగా ఆయన అమెజాన్ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకొంటున్నారు ఈ విషయం ఆయన వెల్లడించారు.
ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇక ఈ సమయంలో మిగిలిన వెంచర్స్ పై దృష్టిపెట్టనున్నారు.. అయితే ఆయన స్ధానంలోకి ఎవరు వస్తారు అంటే ఆండీ జస్సీ రానున్నారు, ఇక ఆయనే అమెజాన్ సీఈఓ కానున్నారు. ఆయన ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్కు నేతృత్వం వహిస్తున్నారు. ఇక కంపెనీ స్టార్టింగ్ నుంచి ఆయన కూడా జెఫ్ బెజోస్ తో ఉన్నారు.
అమెజాన్ సిబ్బందికి రాసిన ఒక లేఖలో బెజోస్ ఈ కీలక విషయం చెప్పారు, ఇక మిగిలిన నా అభిరుచులపై కూడా సమయం కేటాయిస్తాను అని తెలిపారు, 57 ఏళ్ల జెఫ్ బెజోస్ 1994లో ఆన్లైన్ బుక్ షాప్ స్టార్ట్ చేశారు, నేడు ఇంత పెద్ద సామ్రాజ్యం అయింది.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు అమెజాన్ లో ఉన్నారు, జెఫ్ బెజోస్ 196.2 బిలియన్ల సంపద సంపాదించారు.